KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఎవరూ ఊహించని విధంగా సరికొత్త వినోదాత్మక లుక్‌లో మెరిశారు. రాజకీయాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన, తాజాగా ‘ది అండర్ 18 వరల్డ్’ (The Under 18 World) అనే చిన్నారుల గ్రూప్‌తో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ప్రత్యేక టాక్ షో ప్రోమో సోషల్ మీడియాలో విడుదలై, ప్రస్తుతం నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తోంది.
ఈ ఇంటర్వ్యూలో పిల్లల కోరిక మేరకు కేటీఆర్ సరికొత్త ట్విస్ట్ ఇస్తూ.. లైవ్‌లోనే పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫోన్ కాల్ చేశారు. కేటీఆర్ స్క్రీన్‌పై ప్రభాస్‌తో మాట్లాడటం చూసి అక్కడ ఉన్న పిల్లలతో పాటు నెటిజన్లు సైతం షాక్‌తో కూడిన ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘బాహుబలి’ బీజీఎమ్ రావడం విశేషం. ఈ షోలో ఒక చిన్నారి ఛాలెంజ్ విసరడంతో, కేటీఆర్ ఏమాత్రం తగ్గకుండా స్టేజ్ పైనే ఆమెతో పోటీ పడి మరీ పుష్-అప్స్ తీసి తన ఫిట్నెస్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూ రసవత్తరంగా సాగుతున్న సమయంలోనే కేటీఆర్ సతీమణి కల్వకుంట్ల శైలిమ నుంచి ఫోన్ రావడం, దాంతో కేటీఆర్ ఒక్కసారిగా కంగారు పడుతూ.. “షోలో ఉన్నాను, తర్వాత చేస్తా” అంటూ స్పీడ్‌గా ఫోన్ కట్ చేయడం ఈ ప్రోమోకే అసలైన హైలైట్‌గా నిలిచింది. ఎంతటి పవర్ఫుల్ లీడరైనా భార్య ఫోన్ వస్తే ఆ ఆందోళన కామనే కదా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారులు అడిగిన కొన్ని ఫన్నీ, గూగ్లీ లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేటీఆర్ సరదాగా తల పట్టుకోవడం కూడా నవ్వులు పూయించింది. ఒక రాజకీయ నాయకుడిలోని సరికొత్త హుషారైన, వినోదాత్మక కోణాన్ని ఆవిష్కరించిన ఈ పూర్తి ఇంటర్వ్యూ వీడియో త్వరలోనే విడుదల కానుంది.
unexpected Crossover of the Day!
KTR Anna x Prabhas Anna Combo! 🔥💥
KTR Anna ప్రభాస్ అన్న కి కాల్ చేయడం…
ఆ బ్యాక్‌గ్రౌండ్ లో బాహుబలి BGM రావడం… Next Level 🥵😍Waiting for the full episode! 💥#KTR #Prabhas #Under18 pic.twitter.com/WYbctrxQPP
— Praveen Reddy (@Praveen_Prabha_) June 30, 2026