‘ఉప్పెన’ చిత్రంలో బేబమ్మగా చూడముచ్చటైన అందచందాలతో కుర్రకారుని గిలిగింతలు పెట్టింది మంగళూరు సొగసరి కృతిశెట్టి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో జోరుమీదుంది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న ‘బంగార్రాజు’ చిత్రంలో కృతిశెట్టి ఓ నాయికగా నటిస్తున్నది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగచైతన్య జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. గురువారం సినిమాలో ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నాగచైతన్య ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కృతిశెట్టి అలరిస్తుందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతున్నది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, సంగీతం: అనూప్‌రూబెన్స్, కథ, దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ.