బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో బేబమ్మ అనే పాత్రతో ఎంతగానో ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఉప్పెన సినిమాలోకృతి తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ మంగుళూరు ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్న కృతిశెట్టి.. ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న సినిమాలోను హీరోయిన్గా ఎపింకైంది. ‘బంగార్రాజు’ సినిమాలో ఆమె చైతూ జోడీగా కనిపించనుంది. అలాగే సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీ చేస్తోంది. ఈ రోజు కృతి శెట్టి బర్త్ డే సందర్భంగా ఆమె సినిమాలకు సంబంధించిన లుక్స్ విడుదల చేశారు మేకర్స్.
కృతి శెట్టికి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదలైన పోస్టర్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కృతి.. నితిన్ జోడీగా ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాను కూడా చేస్తోంది. షార్ట్ టైంలో ఇన్ని సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకున్న కృతిని చూసి మిగతా హీరోయిన్స్ అసూయ పడుతున్నారు.
Many many happy returns of the day @IamKrithiShetty. Wishing you luck and good health
— Sudheer Babu (@isudheerbabu) September 21, 2021
I'm sure that #AaAmmayiGurinchiMeekuCheppali will be a wonderful experience for you & you will be left with memories to cherish forever 🤗😊
Stay safe & blessed always!! pic.twitter.com/qLvZfEw3mF
Wishing you a very happy birthday @IamKrithiShetty 🤗
— Nani (@NameisNani) September 21, 2021
Team #ShyamSinghaRoy 🙂 pic.twitter.com/0Ia3cjDgo6