నేరస్థుల్ని పట్టుకోవాల్సిన పోలీసులే కేసులో ఇరుక్కుంటే?
‘ఈ సినిమా ఒరిజినల్ చూశాను. ఇందులో చాలా మార్పులు చేశారు. ‘గన్ గవర్నమెంట్‌ది.. వేలు మనది’ అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది. శ్రీకాంత్గారిని రియలిస్టిక్ క్యారెక్టర్లో చూసినందుకు ఆనందంగా ఉంది.
‘ఈ సినిమా ఒరిజినల్ చూశాను. ఇందులో చాలా మార్పులు చేశారు. ‘గన్ గవర్నమెంట్‌ది.. వేలు మనది’ అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది. శ్రీకాంత్గారిని రియలిస్టిక్ క్యారెక్టర్లో చూసినందుకు ఆనందంగా ఉంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు. అల్లు అరవింద్ ధోనీ లాంటి వారు. వెనుక ఆయన ఉన్నారు కాబట్టే బన్నీ వాసు, ఎస్కేఎన్ బాగా ఆడేస్తున్నారు.
ఇప్పుడు విద్యాగారు వస్తున్నారు. ఆమె కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు అనిల్ రావిపూడి. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా, శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తుండగా గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకుడు. ఈ చిత్రం టీజర్ లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి అతిథిగా హాజరై మాట్లాడారు. ‘పోలీసులను రాజకీయనాయకులు ఎలా వాడుకుంటున్నారనేదానిపైనే ఈ సినిమా ఉంటుంది. పోలీసులు పడే బాధలు, ఇబ్బందులు ఇందులో ఉంటాయి. సంతృప్తినిచ్చిన కథ ఇది. యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అందిస్తున్నా’ అని అల్లు అరవింద్ అన్నారు. నేరస్తుల్ని పట్టుకోవాల్సిన పోలీసులే కేసులో ఇరుక్కొని కష్టాలు పడితే?అనే అంశాన్ని తీసుకొని తెరకెక్కించిన సినిమా ఇదని, అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలని దర్శకుడు అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

