Saranga dariya song | సారంగ దరియా సాంగ్ యూట్యూబ్‌ను ఊపేస్తోంది. తెలంగాణ జానపదానికి సుద్దాల అశోక్ తేజ కొత్త బాణీలు దిద్దితే.. తన గొంతుతో మంగ్లీ అద్భుతంగా పాడింది. వీటన్నింటికీ సాయిపల్లవి డ్యాన్స్ తోడు కావడంతో సారంగ దరియా పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ పాటను వింటూ ఫిదా అయిపోతున్నారు. యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ పాటకు 32 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ సారంగ దరియా పాట క్రేజ్ ఎల్లలు దాటేసింది. ఎక్కడో ఉన్న కొరియా వాసులను కూడా ఇప్పుడు మన సారంగ దరియా పాట కట్టిపడేస్తోంది. సారంగ దరియా పాట ట్యూన్‌కు ఇంప్రెస్ అయిన ఒక కొరియన్ యువతి.. ఈ పాట పాడి ఔరా అనిపించింది. ఇప్పుడు ఈ కొరియన్ యువతి పాడిన సారంగ దరియా పాట కూడా యూట్యూబ్‌లో మంచి క్రేజ్ సంపాదిస్తుంది. ఈ పాటకు యూట్యూబ్‌లో ఇప్పటివరకు 8 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
సాయి ధరమ్ తేజ్ సేఫ్.. ఇదిగో చిరంజీవి ఇచ్చిన సాక్ష్యం..
Babu Mohan : స్పోర్ట్స్ బైక్ విచ్చలవిడిగా నడపొద్దు.. ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్
గోపీచంద్ సీటీమార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజు కూత అదిరింది..