Cobra Movie | విక్రమ్ ‘కోబ్రా’ విడుదల వాయిదా పడనుందా?
Cobra Movie gets postponed | చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘ఐ’ వంటి సినిమాలతో ఇక్కడ విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగులో విక్రమ్‌కు టాలీవుడ్ హీరోలకున్నంత క్రేజ్ ఉంది. అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించడం లేదు. ఈ క్రమంలో కొడుకు ధృవ్‌తో కలిసి ‘మహాన్’ చిత్రంలో నటించాడు. ఫిబ్రవరిలో నేరుగా అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. కానీ ఈ చిత్రం ఓటీటీలో విడుదలవడంతో అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ను ఖుషి చేసేందుకు విక్రమ్ ‘కోబ్రా’తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని సమాచారం. కోబ్రా సినిమాకు సంబంధించిన సీజి వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదట. దాంతో మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

