Karthi | శర్వానంద్ దర్శకుడితో కార్తి కొత్త సినిమా?
karthi Next Movie | తమిళంకు సమానంగా తెలుగులో క్రేజ్ దక్కించుకున్న నటుడు కార్తి. ఆయన తన కెరీర్ బిగెనింగ్ నుంచే ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కార్తి సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్ కలెక్షన్లు వస్తుంటాయి.
karthi Next Movie | తమిళంకు సమానంగా తెలుగులో క్రేజ్ దక్కించుకున్న నటుడు కార్తి. ఆయన తన కెరీర్ బిగెనింగ్ నుంచే ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కార్తి సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్ కలెక్షన్లు వస్తుంటాయి. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లు గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. గతేడాది హ్యట్రిక్ హిట్స్ సాధించిన కార్తి.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘జపాన్’ సినిమా చేస్తున్నాడు. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కార్తి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
’96’ సినిమాతో తమిళ్లో గొప్ప ప్రశంసలు దక్కించుకున్న ప్రేమ్ కుమార్‌తో కార్తి తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ప్రేమ్ కుమార్ చెప్పిన కథ బాగా నచ్చడంతో కార్తి వెంటనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా సూర్య సొంత బ్యానర్ అయిన 2డీ ఎంటర్టైనమెంట్స్పై రూపొందనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కథను ప్రేమ్ కుమార్ రూరల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రాసుకున్నాడట. కార్తి ఇందులో మధురైకి చెందిన వాడిగా నటించనున్నాడని టాక్. ఇక ప్రేమ్ కుమార్ ’96’ సినిమాను తెలుగులో శర్వానంద్‌తో ‘జానూ’గా రీమేక్ చేశాడు. కానీ తెలుగులో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

