They Call Him OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఓజీ’ (They Call Him OG) నుంచి ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ పాటను మేకర్స్ యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు. నిజానికి ఈ పాట సినిమా విడుదల సమయంలో ఎడిటింగ్‌లో డిలీట్ చేయబడింది, కానీ అభిమానుల డిమాండ్‌తో తాజాగా దీనిని థియేటర్లలోకి తిరిగి తీసుకువచ్చారు. అయితే తాజాగా మేకర్స్ ఈ పాట యొక్క లిరికల్ వీడియోను సోషల్ మీడియాలో అధికారికంగా విడుదల చేశారు. డిజే టిల్లు భామ నేహా శెట్టి ఈ పాటలో నటించగా.. ఈ పాటను ‘ఓజీ’ గాయపడి చికిత్స పొందుతున్న సమయంలో, విలన్ ఓమీ గ్యాంగ్ సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో చిత్రీకరించారు. ఈ పాటకు తమన్ ఎస్. స్వరాలు అందించగా, శ్రీజో సాహిత్యాన్ని అందించారు. సోహా, వాగ్దేవి, మధుబంతి బాగ్చీ ఈ పాటను ఆలపించారు.
ఈ సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉండటం వలన, అలాగే కథకు అంతగా అవసరం లేదనే కారణంతో దర్శకుడు సుజిత్ మొదట్లో ఈ పాటను ఫైనల్ ఎడిట్ నుంచి తొలగించారు. అయితే, సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, థియేటర్లలో ప్రేక్షకులకు మరింత కిక్ ఇవ్వడానికి దీనిని సెప్టెంబర్ 30 రాత్రి షోల నుంచి మళ్లీ జోడించారు.