కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సెబాస్టియన్ పీసీ 524’. కోమలీ ప్రసాద్, సువేక్ష నాయికలుగా నటిస్తున్నారు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు. మార్చి 4న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవల ఈ చిత్రంలోని ‘వేదనలో వేడుకలా వెలుగు సెబా..రాజాధి రాజా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సానపాటి భరద్వాజ్ పాత్రుడు రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు జిబ్రాన్ స్వరపర్చగా..పద్మలత ఆలపించారు. హీరో సోలో పాటగా ఆర్థ్రంగా సాగిందీ పాట. ‘ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన వస్తున్నది. సినిమాకు కూడా ఇదే ఆదరణ ఆశిస్తున్నాం’ అన్నారు నిర్మాతలు.