ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు!
మా సినిమాకు కోటి రూపాయల కాంటెస్ట్‌ను ప్రకటించి, సక్సెస్‌మీట్‌లో విజేతను తెలియజేస్తామని చెప్పాం. అయితే కొందరు సోషల్‌మీడియాలో ‘ మీ సినిమాకు కోటి రూపాయల కలెక్షన్స్ వస్తాయా? అని ప్రశ్నిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
మా సినిమాకు కోటి రూపాయల కాంటెస్ట్‌ను ప్రకటించి, సక్సెస్‌మీట్‌లో విజేతను తెలియజేస్తామని చెప్పాం. అయితే కొందరు సోషల్‌మీడియాలో ‘ మీ సినిమాకు కోటి రూపాయల కలెక్షన్స్ వస్తాయా? అని ప్రశ్నిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు బహుమతిగా అందిస్తాం. ఈ విషయాన్ని ఊరికే చెప్పలేదు. హైకోర్టు లాయర్‌తో కొన్ని నిబంధనలతో ఒప్పందం రాయించి మరీ ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నాం’ అన్నారు ‘కిల్లర్’ చిత్ర దర్శక, నిర్మాత, నటుడు పూర్వాజ్.
ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. గురువారం సినిమా ప్రీమియర్షోస్ ప్రదర్శిస్తున్నామని, వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తీశారని కథానాయిక జ్యోతి పూర్వాజ్ చెప్పింది. సినిమా సక్సెస్‌మీట్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న విజేతను ప్రకటిస్తామని, తెలుగు సినిమాలో ఇప్పటివరకూ రాని కథాంశమిదని పూర్వాజ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ, రచన-ఎడిటింగ్-దర్శకత్వం: పూర్వాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

