కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘చిరంజీవి’. శుభసాయివెంకట్ దర్శకత్వంలో దీప్తి నడిమింటి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించి సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేసినప్పుడే మేం తొలి విజయాన్ని సాధించాం. ఫస్ట్ కాపీ చూశాక ఈ సినిమా హిట్ అని ఫిక్సయ్యాం. ఈ విధంగా ఈ సినిమా విషయంలో అనేక దశల్లో మేం సక్సెస్ అవుతూ వచ్చాం. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా విజయాన్ని అందుకున్నాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అంటూ దర్శకుడు శుభసాయివెంకట్ సంతోషం వెలిబుచ్చారు.
కంటెంట్ బావుంటే చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో రుజువైందని, ఈ సినిమా తమకు ఎన్నో అనుభవాలను ఇచ్చిందని నిర్మాత దీప్తి నడిమింటి చెప్పారు. మూవీలోని ఎమోషన్‌కు ఆడియన్స్ బాగా కనెక్టయ్యారని, ఈ సినిమాకోసం మేం పడిన కష్టాన్ని ప్రేక్షకుల స్పందన మరిపించిదని హీరో కికు యనమల అన్నారు. ఇంకా ఎడిటర్ చోటా కె ప్రసాద్ కూడా మాట్లాడారు. తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, గిరీష్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: కికు ఎంటర్టైన్మెంట్స్.