సినీపరిశ్రమలో లవ్ ఎఫైర్లు, డేటింగ్, బ్రేకప్ సర్వసాధారమైన విషయాలు అని తెలిసిందే. బాలీవుడ్‌లోనైతే వీటిని చాలా తేలికగా తీసుకుంటారు హీరోహీరోయిన్లు. ఇంతకీ ఈ విషయం గురించి రాయడానికి కారణం ఓ బ్రేకప్ అప్ డేట్. ఇంతకీ బ్రేకప్ అవుతున్న ఈ ఇద్దరు సెలబ్రిటీలెవరనే మీ డౌటు. బాలీవుడ్ సెలబ్రిటీల్లో తరచూ వార్తల్లో నిలుస్తూ…టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే వారిలో కియారా (Kiara Advani)-సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) ఒకరు.
ఈ క్రేజీ బీటౌన్ యాక్టర్లు ఎప్పుడూ ఏదో వెకేషన్ పేరుతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంటపడుతుంటారని తెలిసిందే. కియారా-సిద్దార్థ్ డేటింగ్లో ఉన్నట్టు చాలా కాలంగా బీటౌన్ మీడియాలో వచ్చిన కథనాలు చెబుతున్నాయి. కాగా ఇపుడు మాత్రం కియారా తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ (Break Up) చెప్పేసిందని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోక, మాట్లాడక చాలా కాలం అవుతుండటం ఈ న్యూస్‌కు మరింత బలం చేకూరుస్తుందని టాక్.
అయితే దీనిపై ప్రస్తుతానికి అఫీషియల్‌గా ఎలాంటి లేదు. కానీ క్రేజీ గాసిప్ మాత్రం ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపై కియారా కానీ, సిద్దార్థ్మల్హోత్రా కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. షేర్షా సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు సిద్దార్థ్ మల్హోత్రా. ప్రస్తుతం యోధ, మిషన్ మజ్ను, థ్యాంక్ గాడ్ సినిమాల్లో నటిస్తున్నాడు ఈ యాక్టర్.
మరోవైపు కియారా ప్రస్తుతం శంకర్ -రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15లో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ఇద్దరు తాజా వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది.