‘KGF చాప్టర్ 2’ రికార్డుల మోత.. రాఖీ బాయ్ దెబ్బకు బాలీవుడ్ బేజారు..
KGF Chapter-2 Collections | ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 సినిమా ఊహించిన దానికంటే బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ సంచలనాలు సృష్టిస్తుంది. 10 రోజుల తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా మతి పోతుంది. మరీ ముఖ్యంగా హిందీలో సరికొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు రాకింగ్ స్టార్. కేవలం పది రోజుల్లోనే 300 కోట్ల నెట్ 160 కోట్ల షేర్ వసూలు చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు రాఖీ భాయ్. ఇప్పటి వరకు బాలీవుడ్లో 300 కోట్ల నెట్ దాటిన సినిమాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. బాహుబలి రూ.510 కోట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. దంగల్ 317 కోట్లు.. టైగర్ జిందా హై 301 కోట్లు వసూలు చేశాయి.
తాజాగా కేజీఎఫ్ చాప్టర్-2 పది రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా దంగల్, టైగర్ జిందా హై లైఫ్ టైమ్ కలెక్షన్స్ క్రాస్ చేసి రెండో స్థానంపై కన్నేసింది. కచ్చితంగా 400 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసేలా కనిపిస్తుంది. వీక్ డేస్‌లో కూడా ఎక్కడా వీక్ కావడం లేదు ఈ సినిమా. ఇప్పటికే 820 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. 1000 కోట్ల వైపు అడుగులు వేస్తోంది. ఇదే జరిగితే సౌత్ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి తర్వాత ఆ అరుదైన రికార్డు అందుకున్న దర్శకుడిగా ప్రశాంత్ సంచలనం సృష్టిస్తాడు. అందులోనూ ఎవరూ పట్టించుకోని కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం అనేది చిన్న విషయం కాదు. ఈ విషయంలో రాజమౌళితో పోటీ పడుతున్నాడు ప్రశాంత్ నీల్.
లోకల్ టెక్నీషియన్స్‌తో ఈ స్థాయి విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ ఘనత చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కచ్చితంగా ఈ వారంలోనే సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో రూ.78 కోట్ల బిజినెస్ చేసినప్పుడు ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు వస్తాయా అనుకున్నారు.. కానీ కేవలం తొమ్మిది రోజుల్లోనే 71 కోట్ల షేర్ వసూలు చేసి అందరి అంచనాలను తలకిందులు చేసింది కేజీఎఫ్ చాప్టర్-2. కన్నడతో పోటీపడి తెలుగులో వసూళ్లు సాధిస్తోంది ఈ సినిమా. ఇక హిందీలో అయితే ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ సోలోగా 400 కోట్ల నెట్.. 500 కోట్ల గ్రాస్ వసూలు చేసేలా కనిపిస్తోంది. ఎలా చూసుకున్న కూడా కేజీఎఫ్ సంచలనాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్లో షాహిద్ కపూర్ జెర్సీ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఈ ఒక్క సినిమాతో యష్ రేంజ్ ఆకాశమంత ఎత్తుకు చేరిపోయింది. దాన్ని ఆయన ఎలా కాపాడుకుంటాడు అనేది చూడాలి.
Read More :
“Raveena Tandon | రవీనాపై కాయిన్ల వర్షం..వీడియో షేర్ చేసిన కేజీఎఫ్ నటి 2”
Raveena Tandon | అదే బాలీవుడ్‌కు సౌత్ సినిమాలకు తేడా : రవీనాటాండన్”
KGF Chapter-2 | ‘కేజీఎఫ్-2’ చిత్ర బృందాన్ని అభినందించిన రామ్ చరణ్!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kgf
- kgf chapter 2
- Tollywood
- Yash
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

