‘మహానటి’ చిత్రం నుంచి కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో ఆమె నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రివాల్వర్ రీటా’ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర వినూత్నంగా ఉంటుందని, యాక్షన్ హీరోయిన్గా ఆమెకు సరికొత్త ఇమేజ్ను తీసుకొస్తుందని చెబుతున్నారు. గత నెలలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కె.చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ఫిట్నెస్ మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టిందని, యాక్షన్ ఘట్టాల్లో ఆమె పర్ఫార్మెన్స్ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. కెరీర్లో తొలిసారి యాక్షన్ ప్రధాన చిత్రంలో నటించడం చాలా ప్రత్యేకంగా ఉందని కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్ ‘భోళాశంకర్’ ‘దసరా’ చిత్రాల్లో నటిస్తున్నది.