Keerthy Suresh | ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ తన కలల సౌధాన్ని అభిమానులతో పంచుకుంది. ఏషియన్ పెయింట్స్ నిర్వహిస్తున్న ‘వేర్ ది హార్ట్ ఈజ్ – సీజన్ 9’లో భాగంగా ఆమె కొచ్చిలోని తన సొంత ఇంటిని మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. కేరళ సంప్రదాయ శైలికి ఆధునిక హంగులను జోడించి నిర్మించుకున్న ఈ ఇంటికి ఆమె ‘హౌస్ ఆఫ్ ఫన్’ అని పేరు పెట్టడం విశేషం. ఈ ఇంటి ఇంటీరియర్ మొత్తం లైట్ కలర్స్ మరియు చెక్క ఫర్నిచర్‌తో ఎంతో క్లాసీగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తన సినీ ప్రస్థానంలో అందుకున్న జాతీయ అవార్డుతో పాటు చిన్నప్పటి జ్ఞాపకాలను భద్రపరుచుకున్న ‘మెమరీ వాల్’ ఈ ఇంటికే హైలైట్‌గా నిలిచింది. మరోవైపు తన ముద్దుల కుక్క ‘నైక్’ కోసం ప్రత్యేకంగా కేటాయించిన గదితో పాటు పచ్చని గార్డెన్ ఏరియా చూస్తుంటే ఆమెకు ప్రకృతిపై ఉన్న మక్కువ అర్థమవుతోంది. కాగా ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.