Keeda Cola OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫన్ ఎంటర్టైనర్ ‘కీడా కోలా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Keedaa Cola | టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Keedaa Cola | టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత ఐదేండ్లు గ్యాప్ తీసుకుని తరుణ్ భాస్కర్ ఈ సినిమా తీయగా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తొలి రోజు నుంచే ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టగా.. గ్లోబల్‌గా, దేశీయంగా కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక థియేటర్ ప్రేక్షకులకు అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాలో ‘కీడా కోలా’ సినిమా డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ఈ సినిమాలో చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
ఇక ‘కీడా కోలా’ సినిమా కథ విషయానికి వస్తే.. వాస్తు(చైతన్యరావు) అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. అందులోంచి బయటపడాలంటే డబ్బు అవసరం. జీవన్(జీవన్‌కుమార్).. అనుకోకుండా అవమానాలపాలవుతాడు. ప్రతీకారం తీరాలంటే అతను కార్పొరేటర్ కావాలి. దానికీ డబ్బే అవసరం. వాస్తు తన తాత వరదరాజులు(బ్రహ్మానందం)కోసం తెచ్చిన శీతలపానీయంలో బొద్దంక కనిపిస్తుంది. ఎలాగూ డబ్బు అవసరం కాబట్టి.. దీన్నే అదనుగా తీసుకొని, లీగల్‌గా ప్రొసీడవుతామని సదరు శీలత పానీయం కంపెనీవారిని బెదిరించి డబ్బుగుంజుదామని వాస్తు మిత్రుడు, న్యాయవాది అయిన కౌశిక్(రాగ్‌మయూర్) సలహా ఇవ్వడంతో అసలు కథ మొదలవుఉంది. ఇక జీవన్ విషయానికొస్తే.. తన అన్న నాయుడు(తరుణ్‌భాస్కర్) జైలునుండి విడుదలవ్వడంతో.. అన్న అండతో ఎలాగైనా కారొరేటర్ అవుదామని ఆశపడతాడు. కానీ దానికి కూడా డబ్బే అవసరం కావడంతో వాళ్లు ఓ పన్నాగం పన్నుతారు. ఇంతకీ జీవన్ అండ్ బ్యాచ్ పన్నిన పన్నాగం ఏంటి? శీతలపానీయం కంపెనీవాళ్లను బెదిరించి వాస్తు అండ్ బ్యాచ్ డబ్బులు కొట్టేయగలిగారా? వాస్తు, జీవన్‌లు డబ్బులు సంపాదించగలిగారా? అసలు ఆ ‘కీడాకోలా’ బొద్దంకి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలినకథ.
Daridraniki deggara ga
Paisal ki dhooramga
Mazak la brathukuthunna konni jeevithalanu sudadaniki ready ga undandi…#KeedaaCola🪳,a pakka laugh riot Premieres Dec 29.🤩24 hours early access to aha Gold subscribers@TharunBhasckerD @RanaDaggubati @VGSainma @VivekSudhanshuK… pic.twitter.com/fGHRGINS6B
— ahavideoin (@ahavideoIN) December 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

