కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టా!
ఇటీవలే ‘ది ప్యారడైజ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది అస్సామీ సొగసరి కయాదు లోహర్. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదిన భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇటీవలే ‘ది ప్యారడైజ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది అస్సామీ సొగసరి కయాదు లోహర్. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదిన భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న తమిళ చిత్రం ‘మంజనాతి’ ఒకటి. మహిళా ప్రధాన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తనను వ్యక్తిగతంగా ఎంతో ప్రభావితం చేసిందని కయాదు లోహర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది.
దర్శకుడు మారి సెల్వరాజ్‌తో కలిసి ఖాళీ రహదారిపై నడుస్తున్న ఫొటోను షేర్ చేసింది. ‘నటిగా నేను విభిన్నమైన ప్రపంచంలోకి అడుగుపెట్టా. ఇదొక కొత్త పాఠశాల. నా వ్యక్తిత్వానికి ఎంతో దగ్గరైన పాత్ర ఇది. ఈ ప్రయాణంలో భాగం కావడం సంతోషంగా ఉంది’ అని కయాదు లోహర్ తన పోస్ట్‌లో పేర్కొన్నది. ఈ చిత్రంలో మరో నాయికగా ప్రియాంక మోహన్ నటిస్తున్నది. ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టా!
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

