టాలీవుడ్ మల్లీశ్వరి కత్రినాకైఫ్ (Katrina Kaif) 2021 డిసెంబర్ 9న పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal)ను రాజస్థాన్‌లోని బర్వారా సిక్స్ సెన్సెస్ పోర్టులో రాయల్ వెడ్డింగ్ సెర్మనీ ఘనంగా జరిగింది. అయితే వెడ్డింగ్ సమయం నుంచి ఇప్పటివరకు బయటకు రాని స్టిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సంప్రదాయ వెడ్డింగ్ సెర్మనీ జరిగిన 3 నెలల తర్వాత మార్చి 19న 2022లో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారట.
పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న కత్రినాకైఫ్ ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులతో డ్యాన్స్ చేస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరెవరనే కదా మీ డౌటు. కత్రినాకైఫ్ తల్లి సుజాన్నే టుర్కోట్టే (Suzanne Turquotte), అంకుల్ షామ్ కౌశల్ (Sham Kaushal). గోల్డెన్ అవుట్‌ఫిట్‌లో ఎర్రటి గాజులు, హెన్నా డిజైన్ వేసిన చేతులతో ఉన్న కత్రినాకైఫ్ ఈ ఇద్దరితో డ్యాన్స్ చేస్తోంది.
షామ్ కౌశల్, సుజాన్నేతో కలిసి కత్రినా హ్యాపీమూడ్‌లో డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఫోన్ భూత్, టైగర్ 3, మేరీ క్రిస్మన్ చిత్రాల్లో నటిస్తోంది కత్రినా.