డ్రీమ్ టీమ్ పతాకంపై దర్శక నిర్మాత హరనాథ్ పొలిచెర్ల కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘డ్రిల్’. కారుణ్య చౌదరి హీరోయిన్. భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, రఘుబాబు, జెమిని సురేశ్ తదితరులు ముఖ్య తారాగణంగా ఉన్నారు.
ఈ నెల 16న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ గురువారం విడుదల చేశారు. లవ్ జిహాద్ కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తీశానని హీరో హరనాథ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వంశీకృష్ణ, సంగీతం: డీఎస్ఎస్కే.