Raja Vikramarka Movie Review | రాజా విక్రమార్క రివ్యూ
ఆర్ఎక్స్ 100 (RX 100) చిత్రం సాధించిన విజయంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు టాలీవుడ్ (Tollywood) హీరో కార్తికేయ (Kartikeya). స్పైథ్రిల్లర్తో పట్టు వదలని విక్రమార్కుడిలా..రాజా విక్రమార్క (Raja Vikramarka) చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
By Maduri Mattaiah

ఆర్ఎక్స్ 100 (RX 100) చిత్రం సాధించిన విజయంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు టాలీవుడ్ (Tollywood) హీరో కార్తికేయ (Kartikeya). ఈ చిత్రం తరువాత పలు చిత్రాల్లో నటించినా సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇక ఈసారి ఎలాగైనా విజయాన్ని పొందాలని ఎన్ఐఎ కథాంశంతో..ఓ స్పైథ్రిల్లర్తో పట్టు వదలని విక్రమార్కుడిలా..రాజా విక్రమార్క (Raja Vikramarka) చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో 88 రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో కార్తికేయ అభినయం ఎలా వుంది? ఆయన కోరుకున్న విజయం అందుకునే అంశాలు ఈ చిత్రంలో వున్నాయా? అసలు ఈ చిత్రం కథేంటి తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సిలో (ఎన్ఐఏ) కొత్తగా చేరిన ఆఫీసర్ విక్రమ్ (కార్తికేయ) దూకుడు స్వభావమున్న యువకుడు. సంఘ విద్రోహ శక్తులకు అక్రమంగా ఆయుధాలు అమ్ముతున్న ఓ నల్ల జాతీయుడిని ఎన్ఐఏ బృందం పట్టుకుంటుంది. అతడిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో పొరపాటున విక్రమ్ చేతిలోని గన్ మిస్‌ఫైర్ కావడంతో ఆ నల్లజాతీయుడు మరణిస్తాడు. అయితే అతడు మరణించడానికి ముందు మాజీ నక్సలైట్ గురునారాయణ (పశుపతి)ని చూశానని చెబుతాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం గురు నారాయణ హోం మంత్రి చక్రవర్తి (సాయికుమార్)ను చంపేందుకు ప్లాన్ వేశాడని తెలుస్తుంది. అప్పుడు ఎన్ఐఏ అధికారి (తనికెళ్ల భరణి) ఆ ప్రమాదం నుంచి హోం మంత్రిని కాపాడేందుకు విక్రమ్‌తో కలిసి ఓ ఆపరేషన్ ప్లాన్ చేస్తాడు. ఆ ఆపరేషన్‌లో భాగంగా విక్రమ్ హోంమంత్రిని ఎలా రక్షించాడు ? అతనికెదురైన సవాళ్లను ఎలా ఛేదించాడు? మంత్రిని కాపాడే క్రమంలో విక్రమ్‌కు మంత్రి కూతురు కాంతి (తాన్య రవిచంద్రన్) (Tanya Ravichandran)తో ప్రేమ ఎలా చిగురించింది..? అనేది వెండితెరపై చూడాల్సిందే..!

ఎన్ఐఏ బ్యాక్‌డ్రాప్‌లో..
విశ్లేషణ: ఎన్ఐఏ నేపథ్యంలో సినిమా అనగానే తీవ్రవాదుల వేట, వారి కుట్రలను అడ్డుకుని, దేశాన్ని ప్రజలను ఎలా కాపాడారు? ఎన్ఐఏ అధికారుల ప్రతిభా పాటవాలు.. ఇలా కొనసాగే కథలు ఇప్పటి వరకు మనం చూశాం. అయితే అలా పోల్చుకుంటే ఈ కథ కాస్త భిన్నంగా వుంటుంది. రాష్ట్ర హోం మంత్రిని కాపాడేందుకు ఎన్ఐఏ బృందం ఆపరేషన్ చేపట్టడం.. పట్టుబడిన నల్ల జాతీయుడు అనుకోకుండా గన్‌ఫైర్‌తో మరణించడం.. అతను తెలియజేసిన వివరాలు.. ఇలా కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే ఇక్కడి నుంచి కథను ఎంతో ఉత్కంఠతో కొనసాగాల్సిన కథ కాస్త నెమ్మదిస్తుంది. ఇలాంటి కథలో ప్రేమకథను మిక్స్ చేయడం కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. మొదటి సగం వరకు అందరిలోనూ ఆసక్తి కలిగించే విధంగా వున్నా..సెకండాఫ్‌లో పట్టు కోల్పోయింది..సెకండాఫ్‌పై మరింత శ్రద్ధ పెట్టి వుంటే ఖచ్చితంగా రాజా విక్రమార్క మరో మెట్టు ఎక్కి వుండేది.
విక్రమ్‌గా ఆకట్టుకున్న కార్తికేయ..
దర్శకుడు శ్రీ సరిపల్లి కథగా మంచి పాయింట్‌నే ఎంచుకున్నా.. స్క్రీన్‌ప్లేను జనరంజకంగా తీర్చిదిద్దలేక పోయాడు. రొటిన్ సినిమాల్లా ప్రేమకథను కూడా జోడించే సరికి కథలో కాస్త కంగారు మొదలయ్యింది. దర్శకుడు శ్రీ సరిపల్లి కథపై మరింత కసరత్తు చేసి వుంటే తప్పకుండా రాజా విక్రమార్క ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సఫలీకృతమయ్యేది. ఎన్ఐఏ అధికారి విక్రమ్‌గా కార్తికేయ బాడీలాంగ్వేజ్, నటన ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వుంది. ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నటుడు సుధాకర్ కోమాకుల ప్రతి నాయకుడిగా రెగ్యులర్ నటనకు భిన్నంగా కనిపించాడు. హోం మంత్రి కూతురిగా తాన్య ఫర్వాలేదనిపించింది. సినిమాలో అనుభవజ్ఞులైన నటులు సాయికుమార్, పశుపతిని దర్శకుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. ప్రశాంత్ ఆర్ విహారి నేపథ్య సంగీతం, రాజమౌళి ఛాయాగ్రహణం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
ఫైనల్‌గా : రాజా విక్రమార్క కథ ప్రకారం రొటిన్‌గా అనిపించినా.. కొన్ని ఆసక్తికరమైన మలుపులతో చిత్రం ఉత్కంఠను కలిగిస్తుంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను కోరుకునే వారికి మాత్రం సంతృప్తినిస్తుంది.
రేటింగ్: 2.75/5
Review by; MADURI MATTAIAH
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Adivi Sesh Vs Ravi Teja | అడివి శేష్‌కు రవితేజ సర్ప్రైజ్..పోటీ తప్పదా..?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

