Bedurulanka 2012 | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బెదురులంక 2012 (Bedurulanka2012). క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్ క్యూరియాసిటీ రేకెత్తిస్తూ .. సినిమాపై అమాంతం అంచనాలు పెంచుతున్నాయి.
బెదురులంక 2012 చిత్రాన్ని ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కార్తికేయ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా బెదురులంక 2012 టీం తాడేపల్లి గూడెం, నరసాపూర్, తణుకు, భీమవరంలో సందడి చేసింది. మూవీ లవర్స్, స్టూడెంట్స్‌తో బైక్ ర్యాలీ నిర్వహించారు. హీరోహీరోయిన్లు వారితో ఆడుతూ.. పాడుతూ సందడి చేశారు. ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఈ చిత్రం నుంచి విడుదల చేసిన వెన్నెల్లో ఆడపిల్ల పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కార్తికేయ, నేహాశెట్టి ప్రమోషనల్ టూర్..
Only Love from all over for team #Bedurulanka2012 ❤️
Witness the dramedy entertainer of the season in the theatres in 12 days!! 🎲#Bedurulanka2012onAUG25 🌊@ActorKartikeya @iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @Loukyaoffl @SonyMusicSouth pic.twitter.com/5LtaJsPAXG
— BA Raju’s Team (@baraju_SuperHit) August 13, 2023
బెదురులంక 2012 టీజర్..
వెన్నెల్లో ఆడపిల్ల రొమాంటిక్ ట్రాక్..
బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో..
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో