కార్తికేయ ఫైనల్ సెటిల్మెంట్ ఏమైంది..?

ఈ ఫోటోలు.. అందులో కార్తికేయను చూసిన తర్వాత ఎవరికైనా ఇలాంటి అనుమానాలు రావడం సహజం. ఎందుకంటే బాహుబలిలో బల్లాలదేవుడిలా ఉంటాడు కార్తికేయ. ఆ కటౌట్ అలా ఉంటుంది మరి. కానీ ఇప్పుడు విడుదలైన ఈ ఫోటోలు చూస్తుంటే బక్కచిక్కిన బాహుబలిలా ఉన్నాడు. ఫైనల్ సెటిల్మెంట్ అంటూ కార్తికేయ ఇప్పుడు ఓ సినిమాతో వస్తున్నాడు. అయితే ఈయన తొలి సినిమా కంటే ముందు కమిటైన సినిమా ఇది. ‘ఆర్.ఎక్స్.100’ సాధించిన సంచలన విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయ… దాని కంటే ముందు మరో సినిమాలో నటించాడు. అదే “ఫైనల్ సెటిల్మెంట్”. అప్పుడెప్పుడో పూర్తైన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. వరంగల్-హైద్రాబాద్ లలో ఉండే రెండు గ్యాంగులు ఓ అనాధాశ్రమాన్ని కబ్జా చేయడం కోసం కొట్టుకు చస్తుంటే… సమాజానికి పట్టిన చీడపురుగులు… ఒకళ్ళనొకళ్లు చంపుకుంటుండడం మంచిదే కదా అనే ఆలోచనతో పోలీసులు… ఈ రెండు రౌడీ గ్రూపుల్ని చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు.
ఈ నేపథ్యంలో చోటు చేసుకునే ఆసక్తికర పరిణామాలతో సాగే చిత్రమే “ఫైనల్ సెటిల్మెంట్’. కార్తికేయ నెగటివ్ షేడ్స్ కల హీరోగా నటించిన ఈ చిత్రంలో.. ఛత్రపతి శేఖర్, సతీష్ లంకా, మనస్విని, సలీం, భాస్కర్ రాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఓం శ్రీ గురురాఘవేంద్ర క్రియేషన్స్ పతాకంపై… యువ ప్రతిభాశాలి జమ్మలమడుగు మోహన్ కాంత్ స్వీయనిర్మాణంలో “ఫైనల్ సెటిల్మెంట్” చిత్రానికి దర్శకత్వం వహించారు. అవకాశాల కోసం తిరుగుతున్న కార్తికేయలోని స్పార్క్ ని గుర్తించి… ఈ సినిమాలో ప్రతినాయక ఛాయలు కలిగిన హీరోగా ఎంపిక చేసుకున్నానని దర్శక నిర్మాత జమ్మలమడుగు మోహన్ కాంత్ తెలిపారు. మరి ఎప్పుడో పూర్తైన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చి ఏం చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
కాస్త తగ్గినయ్.. కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు
ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం
పీపీఈ కిట్‌లో పెళ్లి.. వైరల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

