Karthikeya | కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు. కిట్టూ విస్సాప్రగడ రాసిన ఈ గీతాన్ని సాహితి చాగంటి ఆలపించారు. మతం పేరుతో మనుషులను దోచుకునే మోసగాళ్ల గుట్టు విప్పుతూ సాగే గీతమిదని దర్శకుడు తెలిపారు. ‘గోదావరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటివరకు వచ్చిన గ్రామీణ చిత్రాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుంది. కార్తికేయ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది.