Shehzada Trailer | ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కార్తిక్ ఆర్యన్. కెరీర్ బిగెనింగ్ నుండి భిన్న సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లను సాధిస్తున్నాడు. గతేడాది ‘భూల్ భూలయ్య-2’తో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు వన్నె తెచ్చాడు. 2022లో కనీసం వంద కోట్ల సౌండ్‌లేని హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 250 కోట్ల గ్రాస్‌తో బాక్సులు బద్ధలయ్యేలాగా రీ-సౌండ్ చేశాడు. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. అందులో ‘షెహజాదా’ ఒకటి. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అల వైకుంఠపురంలో మూవీకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్‌ను చూస్తుంటే తెలుగు వెర్షన్‌కు ఒక్క మార్పు కూడా చేయనట్లు తెలుస్తుంది. కాపీ పేస్ట్ లాగా ప్రతీది మక్కికి మక్కి దించారు. మురళి శర్మ పాత్రలో పరేష్ రావల్ నటించగా.. ఒరినల్ వెర్షన్లో తాత పాత్ర పోషించిన సచిన్ ఖేడేకర్, రీమేక్ వెర్షన్లోనూ నటించాడు. కార్తిక్ ఆర్యన్‌కు జోడీగా కృతీసనన్ నటించింది. ప్రీతమ్ సంగీతం అందించిన ఈ సినిమాను టీ సిరీస్ ఫిలింస్, అల్లు ఎంటర్టైనమెంట్స్, హారిక& హాసిని క్రియేషన్స్, బ్రాత్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్ డే వీక్ సందర్భంగా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది.