Karthik Aryan | సత్యప్రేమ్ కీ కథ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. విజువల్స్ అదిరిపోయాయిగా..!
Satyaprem Ki Katha Movie Songs | 'భూల్ భూలయ్య-2'తో తిరుగులేని బ్లాక్‌బస్టర్ సాధించిన కార్తిక్ ఆర్యన్ అదే జోరును తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాది విడుదలైన షెహజాదా బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
Satyaprem Ki Katha Movie Songs | ‘భూల్ భూలయ్య-2’తో తిరుగులేని బ్లాక్‌బస్టర్ సాధించిన కార్తిక్ ఆర్యన్ అదే జోరును తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాది విడుదలైన ‘షెహజాదా’ బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. భూల్ భూలయ్య-2 సినిమాలో పావు వంతు కలెక్షన్లు కూడా షెహజాదాకు రాలేకపోయాయి. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ సత్య ప్రేమ్ కీ కథ సినిమాపైనే ఉన్నాయి. సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇక ఇటీవలే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకులను నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది. నజాబ్సే అంటూ సాగే మెలోడియస్ పాట శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పాటలోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. పాయల్ దేవ్ స్వర పరిచిన ట్యూన్ మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. అంతే ఫీల్‌తో పాయిల్ దేవ్, విశాల్ మిత్రతో కలిసి ఈ పాటను ఆలపించాడు. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తిక్ సత్యప్రేమ్గా కనిపించనున్నాడు. కియారా కథ పాత్రలో కనిపించనుంది. నదియా వాలా గ్రాండ్సన్ ఎంటర్టైనమెంట్స్, నమహా పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

