Karthi | సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనదైన టాలెంట్‌తో మంచి పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకున్నాడు హీరో కార్తి. పరుత్తివీరన్ (2007) సినిమాతో నటుడిగా అడుగుపెట్టిన కార్తీ అంతకముందు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. కార్తి సినిమాలకి తమిళంలోనే కాక తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. ఆయన పలు తెలుగు సినిమాలలోను నటించి మెప్పించాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నారు కార్తి. ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
కార్తీకి చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా పిచ్చి. ఏ కొత్త సినిమా వచ్చిన వెంటనే చూడాల్సిందే. కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పుడు ‘రంగీలా’ సినిమాని ఎన్నిసార్లు చూశానో లేక్కే లేదు అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఆ సినిమాలోని తన్హా తన్హా పాటకు ఫిదా అయిపోయి తరుచూ థియేటర్‌కి వెళ్లి ఆ పాటని చూసేవాడట. ఒకసారి టిక్కెట్‌కి డబ్బులు లేకపోవడం వలన దొంగచాటుగా థియేటర్‌కి వెళ్ళాను. నా హడావిడి చూసి థియేటర్ సిబ్బంది టిక్కెట్ అడగడంతో నా దగ్గర లేదని చెప్పాను. దాంతో నన్ను బయటకి గెంటేశారు. అప్పుడు పంతానికి పోయి ఆ నెక్ట్స్ షోకే టిక్కెట్ తీసుకుని మళ్లీ సినిమా చూశా అని తన చిన్ననాటి ఘటనను గుర్తుచేసుకున్నారు కార్తి.
కేవలం సినిమా కోసమే కాదు, సంగీతంపై తనకున్న ఇష్టం అలా ఉండేదని కార్తి వెల్లడించారు. ఇక కాలేజీ చదివే రోజుల్లో టికెట్ లేకుండా వెళ్లిన కార్తి, ఇప్పుడు కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగున్నారు. ‘ఆవారా’ సినిమాతో అదరగొట్టిన కార్తి ఆ తర్వాత ‘యుగానికి ఒక్కడు’, ‘ఊపిరి’ ‘శకుని’, ‘ఖాకీ’, ‘ఖైదీ’ సినిమాలతో తనకంటూ ఫ్యాన్‌బేస్ ఏర్పర్చుకున్నారు. గతేడాది ‘సత్యం సుందరం’ సినిమాతో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం కార్తీ సర్దార్ 2, ఖైదీ 2 చిత్రాలో పాటు హిట్ 4 కూడా ఆయన లిస్ట్‌లో ఉంది. ‘ఖాకీ’ మూవీకి కూడా సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట.ఇక కార్తి.. 2013లో రంజని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు.