Premkumar Chandran | ఐదేళ్ల కిందట తమిళంలో 96 అనే సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఒక ప్యూర్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో రూ.50 కోట్లు కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు. విజయ్ సేతుపతి, త్రిషల నటనను తమిళ ప్రేక్షకులే కాదు యావత్ సినీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. ఓటీటీలోకి వచ్చాక భాషతో సంబంధంలేకుండా సినిమాను అందరూ తెగ ఆదరించారు. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ చంద్రన్ మేకింగ్‌కు ఫ్యాన్స్ అయిపోయారు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను అంత గొప్పగా ఎలా చూపించాడని ఆయనపై బోలెడు ప్రశంసలు కురిపించారు.
ఇదే సినిమాను తెలుగులో శర్వానంద్, సమంతలతో తీసి చేతులు కాల్చుకున్నాడు. దిల్‌రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఇక్కడ ఘోర పరాజయం పాలైంది. ఇక ఇప్పుడు ఆ దర్శకుడు కార్తితో చేతులు కలిపాడు. మధురై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తితో పాటుగా అరవింద్ స్వామి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్య రూపొందించనున్నాడు.