Nagarjuna | కార్తీ షాడో నుంచి బయటపడి.. సూపర్ స్టార్ అయ్యాడు.. సర్దార్ ఈవెంట్లో నాగార్జున
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సర్దార్ (Sardar) అక్టోబర్ 21న విడుదలవుతుంది. తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇవాళ జరిగిన సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈవెంట్లో నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ.. కార్తీతో ఊపిరి సినిమా చేశాను.
పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో కార్తీ (Karthi)నటిస్తున్న చిత్రం సర్దార్ (Sardar). స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలవుతుంది. తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇవాళ జరిగిన సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.
ఈవెంట్లో నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ.. కార్తీతో ఊపిరి సినిమా చేశాను. అప్పటి నుంచి మా అనుబంధం మొదలైంది. సర్దార్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేయడం సంతోషంగా ఫీలవుతున్నా. సర్దార్ సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.ఒక సూపర్ స్టార్ అన్నగా ఉన్నపుడు ఈ షాడో నుంచి బయటకు వచ్చి.. వ్యక్తిగతంగా తనను తాను నిరూపించుకోవడం చాలా తక్కువ. అలాంటి వాళ్లని నేను అరుదుగా ఇద్దరినే చూశాను. మెగాస్టార్ తమ్ముడు పవన్ కల్యాణ్.. కర్ణాటకలో శివరాజ్ కుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్, తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తీని అన్నాడు.
కార్తీ చాలా బోల్డ్‌గా డిఫరెంట్ సినిమాలు చేసి.. కొత్త కథలను ప్రయత్నించి అన్న షాడో నుంచి బయటపడి.. ఇపుడు అన్నంత సూపర్‌స్టార్ అయిపోయాడు. తెలుగులో పాటలు కూడా పాడుతాడు కార్తీ. మొన్ననే వచ్చిన ఒకే ఒక జీవితంలో పాట పాడాడు. తెలుగులో మాట్లాడతాడు.. తెలుగులో మాట్లాడినవాడిని మనం ఎప్పుడూ వదలం. ఇక్కడే పెట్టుకుంటాం. కార్తీని అందుకే తెలుగువారు అంతలా అభిమానిస్తారు. ఈ సినిమాను కూడా అంతే అభిమానిస్తారు. డైరెక్టర్ పీఎస్ మిత్రన్ సినిమాలు కూడా చూశాను. ఆయన తెలుగులో తెరకెక్కించిన అభిమన్యుడు చాలా బాగుంటుంది. ఈ సినిమా కూడా అంత గొప్పగా తీసుంటాడని నా నమ్మకమన్నాడు నాగార్జున.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Karthi
- Nagarjuna
- PS Mithran
- sardar
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

