Karthi New Movie | తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi), టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైనట్లు తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమంతో అధికారికంగా పట్టాలెక్కింది.
టాలీవుడ్లో ‘మ్యాడ్’ (MAD) ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఇప్పుడు హీరో కార్తీతో ఒక భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కార్తీ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్గా నటించబోతుంది. నేడు హైదరాబాద్‌లో జరిగిన ముహూర్తపు వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు మరియు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తీకి తెలుగులో ఉన్న క్రేజ్, కళ్యాణ్ శంకర్ మార్క్ హ్యూమర్ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.