Dhanush | సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిథ్రన్ స్పందిస్తూ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘సర్థార్ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, డేట్స్ సర్దుబాటు చేసే పనిలో ఉన్నామని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆయన ధృవీకరించారు.
ఈ సినిమా పూర్తిగా మైథలాజికల్ నేపథ్యంలో సాగే ఓ భారీ అడ్వెంచర్ జంగిల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని, దీని ప్రీ-ప్రొడక్షన్ పనులు 2026 నవంబర్‌లో ప్రారంభమై, 2027 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాతో దర్శకుడు పి.ఎస్. మిథ్రన్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో ధనుష్ మరియు కరీనా కపూర్ జంటగా నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
మరోవైపు, ‘దేవ్‌దాస్’ చిత్రం తర్వాత కరీనా కపూర్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్లో మళ్లీ ఇన్నాళ్లకు సినిమా వస్తుండటంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2002లో వచ్చిన ‘దేవ్‌దాస్’ చిత్రంలో ముందుగా కరీనాను సంప్రదించినప్పటికీ, ఆ తర్వాత ఆ పాత్ర అశ్వర్యరాయ్ బచ్చన్‌కు వెళ్లడంతో వీరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. దశాబ్దాల తర్వాత ఈ కాంబో మళ్లీ రిపీట్ కానుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, కరీనా కపూర్ నటించిన తాజా చిత్రం ‘దాయ్రా’ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన సెప్టెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదల కానుంది.