Kantara Chapter 1 |ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం ప్రభంజనాలు సృష్టిస్తుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. గతంలో వచ్చిన ‘కాంతార’ మూవీ ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే అక్టోబర్ 2న విడుదలైన ఈ ప్రీక్వెల్ సినిమా అంచనాల కంటే ఎక్కువ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.224 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం పట్ల సినీ పరిశ్రమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. దసరా సెలవులు, వీకెండ్ హెల్ప్ కావడంతో సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. దేశవ్యాప్తంగా హౌస్‌ఫుల్ షోలు, టికెట్లకు డిమాండ్, థియేటర్లలో జనం హంగామా అన్నీ ఈ విజయానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
అయితే తమిళనాడులోని దిండిగల్ లో ఉన్న ఒక థియేటర్లో ఆసక్తికర ఘటన జరిగింది. కాంతార చాప్టర్ 1 సినిమా ప్రదర్శన జరుగుతుండగా, పంజుర్లి దేవుడి వేషధారణలో ఓ వ్యక్తి థియేటర్లోకి వచ్చి రిషబ్ శెట్టి నృత్యాన్ని అచ్చంగా అనుకరించడంతో ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు. అతని పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా పంజుర్లి దేవుడు ఆవహించినట్టు ఫీలయ్యామని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అతని డాన్స్ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. థియేటర్లో కూర్చున్న వారంతా ఆ దృశ్యాన్ని లైవ్ లో చూడటం వల్ల గూస్ బంప్స్ వచ్చాయంటూ స్పందిస్తున్నారు.
విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు హీరోగా నటించగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా, జయరాం, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు కలెక్షన్లు.. మరోవైపు దేవతలు, సాంప్రదాయాల మేళవింపుతో ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం అగ్రస్థానం దక్కించుకుంది. ఈ సినిమా రానున్న రోజులలో మరిన్ని కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అంటున్నారు.
After the screening of #KantaraChapter1 at a cinema in Dindigul, a fan dressed as a Daiva stunned the audience there.#Kantara #KantaraALegendChapter1#RishabShetty #Tupaki pic.twitter.com/rjjJhB5UTm
— Tupaki (@tupaki_official) October 5, 2025