పవర్ స్టార్ అన్నయ్య వచ్చేస్తున్నాడు.. హాలీవుడ్ రేంజ్లో సినిమా ట్రైలర్

ఇప్పుడు టాలీవుడ్‌పైనే అందరి చూపు ఉంది. నిన్న మొన్నటివరకు తమిళ హీరోలు మాత్రమే మనల్ని పలకరించేవారు. వాళ్ల సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసేవారు. అలా సూర్య, కార్తి, విక్రమ్, విజయ్ వంటి తమిళ స్టార్ హీరోలు ఇక్కడ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే కన్నడ హీరోలు కూడా టాలీవుడ్ వైపు కన్నేస్తున్నారు. ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ కావడంతో కన్నడ స్టార్లు కూడా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ యువరత్న సినిమాతో వచ్చాడు. అలాగే కన్నడ స్టార్ దర్శన్ రాబర్ట్ సినిమాలతో వచ్చారు. కానీ ఆ సినిమాలు మనవాళ్లకు రుచించలేదు. ఇప్పుడు కన్నడ పవర్ స్టార్ అన్నయ్య శివరాజ్ కుమార్ టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. జై భజరంగి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
లెజండరీ యాక్టర్ రాజ్‌కుమార్ కుమారుడు శివరాజ్ కుమార్ నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ భజరంగి -2. 2013లో కన్నడలో విడుదలైన బ్లాక్‌బస్టర్ భజరంగి చిత్రానికి ఇది సీక్వెల్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాను అదే స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో జై భజరంగి పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ట్రైలర్లో కనిపించిన విజువల్స్.. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉన్నాయి. హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో పాగా వేయాలని అనుకున్న తమ్మడు ప్రయత్నం ఫలించలేదు. మరి అన్నయ్య ప్రయత్నం అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రభాస్ కు డార్లింగ్ అనే పేరు ఎలా వచ్చింది…?
Meenakshi Chowdhary | మహేశ్‌బాబుతో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది
ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండడా? సుకుమార్ ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడో తెలుసా
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ దేవరకొండనే.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

