ప్రభాస్ కు డార్లింగ్ అనే పేరు ఎలా వచ్చింది…?

Prabhas Darling | బాహుబలి సినిమాతో ప్రభాస్ ( prabhas ) పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అభిమానులను సంపాదించుకున్నాడు. వాళ్లందరికీ బాహుబలి స్టార్‌గా పాపులర్ అయిపోయాడు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగినప్పటికీ ప్రభాస్‌ను తెలుగు ఇండస్ట్రీలో అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఆయన్ను డార్లింగ్ ( darling ) అని పిలవడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా.
బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ అందర్నీ డార్లింగ్ అని పిలుస్తుంటాడు. ప్రభాస్ నోటి నుంచి వచ్చిన డార్లింగ్ అనే పదం ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. దీంతో ప్రభాస్ తర్వాత సినిమాకు డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. ఆ సినిమాలో కూడా డార్లింగ్ ఊతపదం వాడాడు ప్రభాస్. దీనికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రభాస్‌కు డార్లింగ్ అనే పేరు ఫిక్సయిపోయింది. అయితే బుజ్జిగాడు సినిమా నుంచే ప్రభాస్‌కు డార్లింగ్ అనే పదం అలవాటైందని అంతా అనుకుంటుంటారు. కానీ బుజ్జిగాడు సినిమాలో నటించకముందు నుంచే తన ఫ్రెండ్స్‌ను ప్రభాస్ డార్లింగ్ అని పిలిచేవాడంట. ఈ విషయాన్ని ఇటీవల ప్రభాస్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అయితే సినీ ఇండస్ట్రీ విషయానికొస్తే బుజ్జిగాడు సినిమా సెట్స్‌లోనే తొలిసారిగా డార్లింగ్ పదం వాడినట్లు తెలిపాడు. ఇదే విషయాన్ని అప్పట్లో పూరీ జగన్నాథ్ తెలిపాడు. బుజ్జిగాడు సినిమా సెట్స్‌లో ప్రభాస్ నన్ను డార్లింగ్ అని పిలిచేవాడు. నన్ను మాత్రమే అలా పిలుస్తున్నాడేమో అని చాలా సంతోషపడ్డా. కానీ వేరేవాళ్లను కూడా ప్రభాస్ డార్లింగ్ అని పిలవడం చూశా. అప్పుడు డార్లింగ్ అనేది ప్రభాస్ ఊతపదం అని నాకు అర్థమైంది. అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటి తర్వాత 25వ చిత్రం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ఒక చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ టైటిల్‌ను ఖరారు చేశారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్ టీజర్ రాబోతోంది. వీటితో పాటు సలార్ నుంచి ఒక పోస్టర్, ఆదిపురుష్ నుంచి ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Prabhas: ప్రభాస్‌కి సిగ్గు ఎక్కువ.. వీలున్నప్పుడల్లా డిన్నర్ పార్టీ ఇస్తాడన్న కృతి
అమ్మో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా క్లైమాక్స్ కోసం అంత ఖర్చు పెట్టారా?
Prabhas | ప్రభాస్ టేస్టే వేరు.. వ్యానిటీ వ్యాన్ లో ప్రత్యేక సౌకర్యం ఇదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

