Actor Umesh | సినీ పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్‌తో నటుడు ఉమేశ్ మృతి..!
Actor Umesh | దక్షిణ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు ఉమేశ్ (80) కన్నుమూశారు. చాలాకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల కిందట ఆయన ఇంట్లో పడిపోయారు.
Actor Umesh | దక్షిణ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు ఉమేశ్ (80) కన్నుమూశారు. చాలాకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల కిందట ఆయన ఇంట్లో పడిపోయారు. కాలికి గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఆయన కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఆయన చికిత్స తీసుకోవడం ప్రారంభించారు.
ఈ క్రమంలో ఆయన ఆదివారం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన నట జీవితంలో 350కిపైగా సినిమాల్లో నటించారు. రజనీకాంత్‌తో పాటు పలు దక్షిణాదికి చెందిన పలువురు అగ్ర నటులతో వెండితెరపై కనిపించారు. ఆయన మృతికి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ ఉమేశ్ మృతి వార్త తెలుసుకొని బాధపడ్డానన్నారు. తన హాస్యంతో ఉమేశ్ ప్రేక్షకులను నవ్వించారని.. కన్నడ చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లారన్నారు.
ఉమేశ్ సినీ ప్రస్థానం 1960లో ప్రారంభించారు. బీఆర్ పంతులు ‘మక్కల రాజ్య చిత్రంలో బాల నటుడిగా కనిపించారు. ఆ తర్వాత రంగస్థలంపై కళాకారుడిగా రాణించారు. మళ్లీ సినిమాల్లోకి వచ్చి హాస్య నటుడిగా రాణించారు. ఆయన 350కిపైగా చిత్రాల్లో కనిపించారు. హాస్య పాత్రలతో పాటు సహాయక పాత్రల్లోనూ అద్భుతంగా రాణించారు. కథా సంగమ (1977), గురు శిష్యులు (1981), అపూర్వ సంగమ (1984) తదితర చిత్రాలు ఆయనకు గుర్తింపును తీసుకువచ్చారు. 1975లో కథా సంగమ చిత్రానికి ఆయన కర్నాటక రాష్ట్ర ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నారు. 1994లో కర్నాటక నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఆయన ఆత్మకథ బన్నద ఘంటే విమర్శలకు ప్రశంసలు పొందింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

