Kanguva Movie OTT | తమిళ అగ్ర కథానాయకుడు సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). స్టూడియో గ్రీన్(Studio Green) అధినేత కేఈ జ్ఞానవేల్ ఈ సినిమాను నిర్మించగా.. సిరుత్తై శివ (siva) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరజయం అందుకుంది. విడుదలై నెల కూడా కాకుండానే ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్మెంట్ను పంచుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం డిసెంబర్ 08 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. దిశా పటానీ, బాబీ డియోల్, యోగి బాబు కీలక పాత్రల్లో నటించగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రష్యాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు కొందరు పిల్లలను బంధించి, వారిపై ప్రయోగాలు చేస్తుంటారు. వారి నుంచి ఓ పిల్లాడు తప్పించుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. తప్పించుకున్న పిల్లాడు ప్రాన్సిస్(సూర్య) దగ్గరకు చేరతాడు. ఆ పిల్లాడెవరో ఫ్రాన్సిస్కి తెలీదు. కానీ ఇబ్బందుల్లో ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. రష్యన్ దుండగలు ఆ పిల్లాడ్ని వెంబడిస్తుంటారు. ఫ్రాన్సిస్ కాపాడుతుంటాడు. అసలు ఆ పిల్లాడెవరు? ఫ్రాన్సిస్ దగ్గరకే ఎందుకు చేరాడు? ఫ్రాన్సిస్కీ ఈ పిల్లాడికీ ఉన్న సంబంధం ఏంటి? అసలు ‘కంగువ’ అంటే ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
A tale as old as time ⚔️ & a LEGACY that lives on 🦅
KANGUVA arrives to settle it all 🔥#KanguvaOnPrime, Dec 8 pic.twitter.com/eDLqMDd2hD— prime video IN (@PrimeVideoIN) December 6, 2024