Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
Kangana Ravi Babu | టాలీవుడ్ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌తో ఓ భారీ హారర్ థ్రిల్లర్‌ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
Kangana Ravi Babu | టాలీవుడ్ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌తో ఓ భారీ హారర్ థ్రిల్లర్‌ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు దర్శకుడు రవిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. న్యూఢిల్లీలో హాలోవీన్ సందర్భంగా నిర్వహించిన ‘హారర్కాన్ ఇండియా 2026’ కార్యక్రమంలో రానా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘స్కేరీ పిక్చర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ హారర్ థ్రిల్లర్‌లో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటం విశేషం.
తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రవిబాబు.. ఇప్పుడు తొలిసారిగా హిందీ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ప్రాజెక్టును రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా సంస్థలపై సినిమా రూపొందనుంది. కంగనా తన సామాజిక మాధ్యమ ఖాతాలో రానా ప్రకటించిన వీడియోను పంచుకోవడంతో ఈ ప్రాజెక్టుకు మరింత ప్రచారం లభించింది. తెలుగు సినీ పరిశ్రమలో రవిబాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘అనసూయ’, ‘అవును’ వంటి సినిమాలతో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను విభిన్నంగా తెరకెక్కించగల దర్శకుడిగా పేరు సంపాదించారు. సాధారణ కథనాలకు భిన్నంగా కొత్త ప్రయోగాలు చేయడం ఆయన ప్రత్యేకత. ‘అదుగో’ వంటి ప్రయోగాత్మక చిత్రంతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇప్పుడు కంగనా రనౌత్ లాంటి ప్రతిభావంతమైన నటితో హిందీలో హారర్ సినిమా రూపొందిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది. రవిబాబు తనదైన శైలిలో భయానక వాతావరణాన్ని ఎలా సృష్టిస్తారోనని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కంగనా రనౌత్ గతంలో ‘రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్’ సినిమాలో హారర్ నేపథ్యంలో నటించారు. ఆ తర్వాత ‘చంద్రముఖి 2’ వంటి చిత్రాల్లోనూ కనిపించారు. ఇప్పుడు ‘స్కేరీ పిక్చర్’తో మరోసారి హారర్ కథలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత హిందీలో పూర్తిస్థాయి హారర్ చిత్రంతో ఆమె ప్రేక్షకులను పలకరించబోతున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కంగనా నటన, రవిబాబు దర్శకత్వం, రానా నిర్మాణం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
KTR Tour Photos | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా నీరాజనం.. ఫోటోలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

