 
                                                            న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ 303 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా కూటమి 201 చోట్ల లీడ్‌లో కొనసాగుతోంది. కాగా ఈ సారి కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో సినీ తారలు బరిలో నిలిచారని తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న సినీ సెలబ్రిటీలు హేమమాలిని, కంగనారనౌత్, సురేశ్ గోపీ, మనోజ్ తివారీ, రవికిషన్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
కంగనారనౌత్ మండి లోక్‌సభ నియోజకవర్గం (హిమాచల్ ప్రదేశ్): 16,100 ఓట్ల ఆధిక్యం (బీజేపీ)
సురేశ్ గోపీ త్రిస్సూర్ లోక్‌సభ నియోజకవర్గం (కేరళ) : 10,142 ఓట్ల ఆధిక్యం (బీజేపీ)
రవికిషన్ గోరఖ్‌పూర్ లోక్ సభ నియోజవర్గం (ఉత్తరప్రదేశ్) : 9,463 ఓట్ల ఆధిక్యం (బీజేపీ)
హేమమాలిని మధుర లోక్‌సభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్) : 38,097 ఓట్ల ఆధిక్యం (బీజేపీ)
మనోజ్ తివారి ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం (ఢిల్లీ) : 18,122 ఓట్ల ఆధిక్యం (బీజేపీ)
ఏపీ ఫలితాల్లో లీడింగ్‌లో.. 
ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతపై లీడింగ్‌లో 19 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిందూపూర్ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 7,680 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
                            