నాగ చైతన్య-సమంత తమ బంధానికి పులిస్టాప్ పెడుతున్న విషయాన్ని శనివారం అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన జంట విడిపోతున్న విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు వారు మద్దతుగా నిలిస్తే, వర్మ లాంటి వాళ్లు విడాకులు తీసుకొని మంచి పని చేసినట్టుగా చెబుతున్నారు.
ఇక కాంట్రవర్సీస్‌కి కేరాఫ్‌గా నిలిచే కంగనా రనౌత్ తాజాగా నాగ చైతన్య- సమంత విడాకుల మధ్యలోకి అమీర్ ఖాన్ ను లాక్కొచ్చింది. చైతూ- సామ్ విడిపోవడానికి కారణం ఆమీర్ అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చింది. తాజాగా విడాకులిచ్చిన సౌత్ హీరో, కొన్ని రోజుల కిందట ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని, ఆ వెంటనే తన భార్యకు సౌత్ హీరో విడాకులిచ్చాడని పేర్కొంది కంగనా.
సదరు బాలీవుడ్ హీరోకి విడాకుల స్పషలిస్ట్గా పేరు ఉంది.ఆయన ఎందరో మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. పదేళ్లు రిలేషన్ షిప్ లో ఉండి, నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో.. విడాకుల స్పెషలిస్ట్‌ని కలిసిన వెంటనే తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆయన సలహాలు తీసుకొని ఇలా చేశాడేమో అని ఆమె పేర్కొంది.
సమాజంలో విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకొచ్చినా అందులో మగాడిదే తప్పంటోంది కంగన. దేవుడు అలా సృష్టిని తయారుచేశాడని.. మగాళ్లు వేటగాళ్లుగా, మహిళలు బలిపశువులుగా మారడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చింది. దుస్తులు మార్చినంత ఈజీగా ఆడవాళ్లను మార్చేసే పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కంగనా.
ఇది కూడా చూడండి