Indian-2 Movie latest Update | ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లో రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన తొలి సినిమాగా సంచలన రికార్డు క్రియేట్ చేసింది. అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు ఎలా నడుం బిగించాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శంకర్ డైరెక్షన్, కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ తమిళ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. భారతీడయడు-2 యూనిట్ మరో వారంలో సౌతాఫ్రికా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఓ మేజర్ షెడ్యూల్‌ను చిత్రీకరించినున్నట్లు టాక్. ఈ షెడ్యూల్లో ట్రైన్ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని వినికిడి. అంతే కాకుండా ఈ షెడ్యూల్ పూర్తయితే దాదాపు షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లే అని సమాచారం. ఇక శంకర్ ఓ వైపు ఇండియన్-2ను తెరకెక్కిస్తూనే మరోవైపు రామ్‌చరణ్‌తో RC15 చేస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.