Kamal Haasan-H.Vinoth Movie | విక్రమ్‌తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన కమల్ అదే జోష్‌తో ఇండియన్-2ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుందని టాక్. ఇక ఈ సినిమా తర్వాత కమల్ మణిరత్నంతో సినిమా చేయబోతున్నాడు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా రానుండటంతో అందరిలోనూ తిరుగులేని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో శింబు కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం.
ఈ సినిమా తర్వాత కమల్ వలిమై, తెగింపు సినిమాల దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ రైతుల సమస్యల చుట్టూ తిరుగుతుందట. వాళ్ల కష్టాలను అడ్రెస్ చేస్తూ కథను రాసుకున్నాడట. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ప్రస్తుతం కమల్ ఇండియన్-2తో బిజీగా గడుపుతున్నాడు. సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు కంపోజ్ చేస్తున్నాడు. కాజల్ హీరోయిన్గా నటిస్తుంది.