KH233 | వలిమై, తునివు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు తమిళ దర్శకుడు హెచ్ వినోథ్ (H Vinoth). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ లోకనాయకుడు కమల్ హాసన్ (kamalhaasan)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. KH233 ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి KH233 షురూ అంటూ కొన్ని రోజుల క్రితం ఓ అప్డేట్ను వీడియో రూపంలో ఉలగనాయగన్ షేర్ చేయగా.. ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
రైజ్ టు రూల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంపై స్టన్నింగ్ అప్డేట్ అందించింది కమల్ హాసన్ టీం.KH233 వచ్చే కీలక యాక్షన్ పార్టు కోసం కమల్ హాసన్ శిక్షణ తీసుకుంటున్నాడు. గట్స్ అండ్ గన్స్‌తో.. రూలింగ్ చేయడానికి వస్తున్నాడు.. అంటూ షేర్ చేసిన వీడియో గూస్బంప్స్ తెప్పించేలా సినిమా ఉండబోతుందని తెలియజేస్తోంది. ఈ చిత్రంలో చాలా ఖరీదైన ఆయుధాలను వినియోగించినట్టు వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సమర్పణలో హోంబ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్పై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. హెచ్ వినోథ్ సామాజిక కథాంశంతో అందరినీ ఆలోచింపజేసేలా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడని ఇప్పటికే ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
కమల్ హాసన్ ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఇండియన్ 2 సినిమా చేస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. మరోవైపు లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో KH234 ప్రాజెక్ట్‌కు కూడా సైన్ చేశాడు. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గన్స్ లోడింగ్..
Guts & Guns 🔥
Training Begins #FuriousAction in #KH233#Ulaganayagan #KamalHaasan #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #Mahendran #HVinoth@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/Mec86yIhlh
— Raaj Kamal Films International (@RKFI) September 7, 2023
KH233 షురూ..
And it begins…#RKFI52 #KH233
#RISEtoRULE #HVinoth #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/7cej87cghE— Kamal Haasan (@ikamalhaasan) July 4, 2023
డైరెక్టర్ హెచ్ వినోథ్‌కు కమల్ బర్త్ డే విషెస్..
Wishing our director, #HVinoth, a happy birthday! #Ulaganayagan #KamalHaasan #KH233 #RKFI52 #RISEtoRULE https://t.co/vvsqEBrM2M
— Raaj Kamal Films International (@RKFI) September 5, 2023