Kalyani Priyadarshan Speech | తనపై ప్రేమ చూపించిన మొదట ఆడియన్స్ తెలుగువాళ్లే అని తెలిపింది మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘లోక: చాప్టర్ 1 – చంద్ర’ (తెలుగులో ‘కొత్త లోక’). ఈ సినిమాకు డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా.. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహారించాడు. ఓనం పండుగ సందర్భంగా ఆగష్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మలయాళంలో మొదటి లేడీ సూపర్ హీరో చిత్రం అయిన ఈ సినిమా, తెలుగులో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ సందర్భంగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్. అయితే ఈ వేడుకలో కళ్యాణి మాట్లాడుతూ.. తెలుగువాళ్లే తనపై మొదటగా ప్రేమను చూపించారని తెలిపింది. ఇది నేను ఎప్పటికి మర్చిపోరని తెలిపింది. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది కళ్యాణి. తెలుగులో చాలా రోజుల నుంచి సినిమా చేయాలని ఉంది. కానీ మంచి కథ దొరకడం లేదంటూ కళ్యాని చెప్పుకోచ్చింది. కొత్త లోక సినిమాకు ఇంత భారీ విజయం చేసినందుకు తెలుగు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
కళ్యాణి ‘హలో’ (2017) సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ, ఆమె నటనకు మరియు అందానికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె ‘చిత్రలహరి’ మరియు శర్వానంద్‌తో రణరంగం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.