Kalki 2898 AD | అగ్ర కథానాయకుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా నెల రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్ పాల్గోంటుంది కల్కి టీమ్. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాను 3డీ (3D)లో కూడా రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 3డీ వెర్షన్‌కు సాంకేతికంగా కూడా మార్పులు చేయాల్సి రావడం వలన ఆలస్యం కానున్నట్లు సమాచారం. అలాగే 3డీ వెర్షన్‌కు తగిన స్క్రీన్స్‌ను కూడా ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. దీనికోసం బ్యాగ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.
మరోవైపు ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ మొదటివారంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.