ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా 1200కోట్ల వసూలు చేసింది. ఫ్రాంచైజీలో ఏ తొలి పార్ట్‌కూ ఇంత కలెక్షన్ రాలేదు. ఆ విధంగా ‘కల్కి 2898ఏడీ’ ఆలిండియా రికార్డ్. తొలి పార్టే ఇంత వసూళ్లను రాబడితే.. ఇక మలి పార్ట్ రిలీజైతే పరిస్థితేంటి? అనేది అటు ప్రభాస్ అభిమానుల్లోనూ, సినీ విశ్లేషకుల్లోనూ నలుగుతున్న ప్రశ్న. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కొత్త కొత్త పాత్రలు కథలో ఎంట్రీ ఇచ్చాయి. భైరవ(ప్రభాస్).. కర్ణుడిగా తెరపై సాక్షాత్కరించాడు. కురుక్షేత్రంలో అర్జునుడిగా దేవరకొండ విజయ్ తళుక్కున మెరిశాడు. సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ ైక్లెమాక్స్‌లో విశ్వరూపం చూపించేశాడు.. ఇక అశ్వత్థామ సంగతి సరేసరి.
సెకండ్ పార్ట్‌లో ఈ పాత్రలు చేసే విన్యాసాలు ఎలా ఉంటాయి? అనే ఊహే రోమాంచితం చేస్తున్నది. ఇప్పటికే సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా 40శాతం పూర్తయ్యిందని దర్శకుడు నాగ్అశ్విన్ ఓ సందర్భంలో చెప్పాడు కూడా. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ని నాగ్అశ్విన్ మీడియాకు వెల్లడించారు. అన్నీ కుదిరితే.. ఈ ఏడాది చివర్లో ‘కల్కి2’ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, ది రాజాసాబ్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ సెట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ మూడూ అయ్యాక ఆయన ‘కల్కి2’ చేస్తారా? ‘సలార్2’ మొదలుపెడతారా? అనే మీమాంస జనాల్లో ఉంది. నాగ్అశ్విన్ ప్రకటనతో ‘కల్కి2’ విషయంలో క్లారిటీ వచ్చేసింది.