సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక సెలబ్రిటీలకు అనేక తంటాలు వచ్చిపడ్డాయి. వారు ఏం చేసిన కొద్ది నిమిషాలలో అది వైరల్ అవుతుంది. నచ్చితే ప్రశంసిస్తుంటారు, లేదంటే దూషిస్తుంటారు. తాజాగా అలనాటి అందాల సుందరి కాజోల్ ఆటిట్యూడ్ చూపించింది అంటూ ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
వివరాలలోకి వెళితే కాజోల్ ఈ మధ్య తన 47వ పుట్టిన రోజు జరుపుకుంది. కరోనా వలన సన్నిహితుల మధ్య మాత్రమే సెలబ్రేషన్స్ చేసుకుంది. అయితే కాజోల్‌కి అభిమాన గణం చాలా ఎక్కువే కాబట్టి కొందరు ఫ్యాన్స్ ఆమె ఇంటి దగ్గరకు కేక్ పట్టుకొని వచ్చారు. ఈ విషయం కాజోల్‌కి చెప్పడంతో ఆమె బయటకు వచ్చి రోడ్డు మీదనే అభిమానుల మధ్య కేక్ కట్ చేసింది.
తాము తెచ్చిన కేక్ ముక్కను తినాలని అభిమానులు కోరారు. అందుకు నో అంటే నో అనేసిన ఆమె.. ససేమిరా అంటూ లోపలకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై పలువురు ఆమెను తిట్టిపోస్తున్నారు. అంత యాటిట్యూడ్ అవరసరమా అంటూ కాజోల్‌ని ట్రోల్ చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో కనిపించే అంత సాఫ్ట్ కాజోల్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.