సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కపుల్స్ లో కాజల్-గౌతమ్ కిచ్లూ టాప్ ప్లేస్ లో ఉంటారు. పెండ్లి పీటలెక్కిన నాటి నుంచి ఇప్పటివరకు తరచూ ఏదో ఒక అప్ డేట్‌తో ఫాలోవర్లను పలుకరిస్తూనే ఉన్నారు. వెకేషన్ స్టిల్స్, సరదా, రొమాంటిక్ క్షణాలను అందరితో పంచుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరు ఈ సారి మాత్రం చాలా సీరియస్ గా ఉన్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
సీరియస్ గా ఉండటమేంటీ అనుకుంటున్నారా..కాజల్, గౌతమ్ వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారంతే. సాఫ్ట్ వేర్ కపుల్ వర్క్ ఫ్రమ్ హోం మూడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుందీ కాజల్-గౌతమ్ స్టిల్. బ్లాక్ డ్రెస్ లో ఉన్న కాజల్ గాగుల్స్ పెట్టుకుని పుస్తకం చదువుతుంటే..పక్కనే కూర్చున్న గౌతమ్ ల్యాప్ టాప్ లో సీరియస్ గా తన పనిచేసుకుంటున్నాడు. కాజల్-గౌతమ్ ఇంట్లో ఉన్నపుడు రోజూ ఇలాగే ఉంటారేమో అని తాజా స్టిల్ చూసిన చాలా మంది అనుకుంటున్నారు.
కాజల్ ప్రస్తుతం హిందీలో ఉమ సినిమా చేస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాలో నటిస్తోంది. వీటితోపాటు పలు ప్రాజెక్టులను లైన్ లో పెట్టింది.
ఇవి కూడా చదవండి..
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!