స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. ఈ చిత్రంలో కాజల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటిస్తున్నది. ‘సత్యభామ’ సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శిశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకొన్నదీ సినిమా. 35 రోజుల భారీ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయ్యింది. ఈ షెడ్యూల్లో హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసింది కాజల్ అగర్వాల్. ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. కాజల్ గతంలో ఎప్పుడూ కనిపించని యాక్షన్ మోడ్‌లో ‘సత్యభామ’లో కనిపించనున్నది. కాజల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి ఈ యాక్షన్ సీక్వెన్సులు కంప్లీట్ చేసింది. సినిమాలో ఈ పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని టీమ్ నమ్ముతున్నది. బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్మెంట్కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో నటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర తదితరులు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: జీ విష్ణు, నిర్మాతలు: బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి, దర్శకత్వం: సుమన్ చిక్కాల.