ముంబై: టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ ఇటీవల ఓ ఇన్స్టా పోస్టులో బాడీ షేమింగ్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. గర్భిణి అయిన కాజల్ సుఖ ప్రసవం కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రెగ్నెన్సీ వేళ ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలో ఆమె తన కొత్త పోస్టులో చెప్పింది. ఓ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు చేస్తున్న వీడియోను కాజల్ పోస్టు చేసింది. ఆ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చిందీ బ్యూటీ. తానెప్పుడూ యాక్టివ్గా ఉంటానని, జీవితం మొత్తం వర్కౌట్ చేస్తూనే ఉన్నానని, అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఇది కాస్త వేరుగా ఉంటుందని, ఎటువంటి సమస్యలు లేని గర్భిణులు.. ఎరోబిక్, స్ట్రెంత్ ఎక్సర్సైజ్లు చేయాలని ఆమె తన ఇన్స్టా వీడియోలో సూచించింది. ప్రెగ్నెన్సీ వేళ హెల్తీ లైఫ్ స్టయిల్ కోసం ఇలాంటి ఫిట్నెస్ తప్పదని ఆమె అన్నారు.