గత రెండేళ్ల నుంచి తెలుగు సినిమాలకు విరామం తీసుకున్న అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ‘భగవంత్ కేసరి’ చిత్రం ద్వారా మరలా ప్రేక్షకులను పలకరించబోతున్నది. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 19న విడుదలకా నుంది.
శనివారం ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కాత్యాయనిగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో కాజల్ అగర్వాల్ చిరునవ్వులు చిందిస్తూ మెరిసిపోతున్నది. కథాగమనంలో కాత్యాయని పాత్ర కీలకంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. శ్రీలీల, అర్జున్‌రామ్‌పాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.