Kajal Aggarwal | సెకండ్ ఇన్నింగ్స్‌పై కాజల్ అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kajal Aggarwal | తల్లి అయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. రావడం రావడమే ‘భగవంత్ కేసరి’తో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విషయం గురించి ఇటీవలే ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది కాజల్.
Kajal Aggarwal | తల్లి అయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. రావడం రావడమే ‘భగవంత్ కేసరి’తో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విషయం గురించి ఇటీవలే ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది కాజల్. ‘నేను రీఎంట్రీ ఇవ్వాలనుకున్న తర్వాత ఏ తరహా సినిమాలతో ఎంట్రీ ఇస్తే బావుంటుంది? అనే విషయంపై కొన్ని రోజులు తర్జనభర్జన పడ్డాను. అనుకోకుండా ‘భారతీయుడు-2’ అవకాశం తలుపుతట్టింది. అందులో నా పాత్ర సాధారణమైంది కాదు. ఆ పాత్ర కోసం ‘కలరి పయాట్టు’ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నాను. చాలా కష్టపడ్డాను.
ఆ సమయంలోనే ‘సత్యభామ’ ప్రపోజల్ వచ్చింది. అది లేడీఓరియంటెడ్ సబ్జెక్ట్. కథ బావుంది. ఆ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ రెండే నా రీఎంట్రీ మూవీస్ అని ఫిక్సయ్యాను. కానీ అనుకోకుండా ‘భగవంత్‌కేసరి’ చేయాల్సి వచ్చింది. అనిల్ నాకు మంచి ఫ్రెండ్ కావడం, ముఖ్యంగా బాలయ్యసార్ సినిమా కావడంతో మంచి అవకాశం వదులుకోవడం దేనికని ఓకే చెప్పాను. నా అదృష్టమేమోగానీ, పెద్ద విజయంతో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు భారతీయుడు-2, సత్యభామ చేస్తున్నాను. మనం నిమిత్తమాతృలం. మనకు ఏ టైమ్‌లో ఏది కరక్టో, దాన్ని దేవుడే ఇస్తాడు. గాడ్ ఈజ్ గ్రేట్’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

